
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ.. అటు వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మతో కలిసి లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో గ్లామర్ సీన్లలో రెచ్చిపోయింది.

సమంత.. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్నాళ్ల క్రితం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో కనిపించింది. ఆ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ఓటీటీ ప్రియులను అలరించింది.

రాజశ్రీ దేశ్‌పాండే హిందీలో మోస్ట్ పాపులర్ బ్యూటీ. నేర నేపథ్యం ఉన్న వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్‌లో రాజశ్రీ దేశ్‌పాండే బోల్డ్ పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్ ద్వారా చాలా క్రేజ్ సంపాదించుకుంది.

బాలీవుడ్ నటి కాజోల్ సైతం బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది. ఆమె ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర పోషించింది. కోర్టు డ్రామా కథపై దృష్టి సారించే ఈ వెబ్ సిరీస్ 2023లో డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలైంది.

తెలుగులో పద్దతిగా కనిపించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ రాశీఖన్నా ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవల ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ తో కలిసి నటించింది. ఇందులో రొమాంటిక్ సీన్లతో కనిపించింది.