
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పట్లో మొదలవ్వడం కష్టమేనా..? అందుకే ఆయన సినిమాలు కాదని యాడ్స్ వైపు అడుగులు వేస్తున్నారా..? ఉన్నట్లుండి చరణ్ ముంబై టూర్ వెనక అసలు ప్లాన్ ఏంటి..? ఎన్ని రోజులు ఆయన అక్కడ ఉండబోతున్నారు..? కెప్టెన్ కూల్ ఎమ్మెస్ ధోనీని చరణ్ ఎందుకు కలిసినట్లు..? ఈ డీటైల్స్ అన్నీ చూసేద్దాం ఈ స్పెషల్ స్టోరీలో..

గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఎలాగూ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు.. ఆర్టిస్టుల డేట్స్ లేక అనుకున్న దానికంటే ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. దాంతో ఖాళీగా ఉండటం ఎందుకని యాడ్స్‌కు టైమ్ ఇచ్చేస్తున్నారు రామ్ చరణ్. అందుకే ముంబైకి వెళ్లిపోయారు.. అక్కడే సిద్ధి వినాయక ఆలయంలో అయ్యప్ప మాల తీసేసారు చరణ్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు.

అయ్యప్ప మాల విసర్జన తర్వాత యాడ్ పనుల్లో బిజీ అయిపోయారు చరణ్. ప్రస్తుతం ఓ యాడ్ షూట్ కోసమే ముంబై వెళ్లిన ఈయన.. అక్కడే కెప్టెన్ కూల్ ఎమ్మెస్ ధోనీని కలిసారు.

ఈ ఇద్దరూ కలిసే ఓ కమర్షియల్‌లో కనిపించబోతున్నారు. ముందు నుంచి ధోనీ, చరణ్ మంచి ఫ్రెండ్స్. పదేళ్ల కిందే ఇద్దరూ కలిసి రెండు మూడు యాడ్స్ చేసారు.. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అవుతుంది.

కమర్షియల్ యాడ్ కోసం ట్రెండీ లుక్‌లోకి మారిపోయారు రామ్ చరణ్.. అలాగే ఎమ్మెస్ ధోనీ కూడా న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి చేసే యాడ్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ అక్టోబర్ మూడో వారంలో మొదలు కానుంది. ఇక బుచ్చిబాబు సినిమా డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి రానుంది.