
మీనాక్షి చౌదరి ఇన్నాళ్లూ ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభరలో మాత్రమే నటిస్తున్నారు మీనాక్షి.

అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు మీనాక్షి. అక్కడి సేద తీరుతున్నారు. ఆమె అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. అవి వైరల్ అవుతున్నాయిప్పుడు.

శ్రీలీల కూడా మామూలు బిజీగా లేరిప్పుడు. 2024లో కాస్త జోరు తగ్గించిన శ్రీలీల.. 2025లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఈ ఏడాది 5 సినిమాలతో రానున్నారు ఈ బ్యూటీ. ఈలోపే చిన్న వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత బేబీ జాన్ ప్రొమోషన్స్తో బిజీ అయినా కీర్తి కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని భర్తతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు.

త్రిష ఇటు సినిమాలతో పాటు అటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో చిరుతో విశ్వంభరతో పాటు.. తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్నారీమె. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. కాస్త రిలీఫ్ కోసం ఆ మధ్య పటాయ బీచ్‌కు వెళ్లొచ్చారు. మొత్తానికి వెకేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు మన హీరోయిన్లు.