Movie Climax: కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..

|

Dec 23, 2024 | 4:25 PM

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. అది బాగుంటే బొమ్మ బ్లాక్‌బస్టర్. అందుకే క్లైమాక్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మన దర్శకులు. మరీ ముఖ్యంగా చివరి 5 నిమిషాల్లోనే సినిమాపై ఉన్న ఒపీనియన్ కూడా మారిపోయేలా క్లైమాక్స్ రాసుకుంటున్నారు. తాజాగా మరో సినిమాకు ఇదే చేస్తున్నారని తెలుస్తుంది. మరింతకీ ఏంటా సినిమా..?

1 / 5
ఓ కథనే ఎలా మొదలుపెట్టాం అన్నది కాదు.. ఎలా ముగించాం అనే దాన్ని బట్టే దాని స్థాయి డిసైడ్ అవుతుంది. మన దర్శకులు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నారిప్పుడు. కావాలంటే మొన్న దివాళికి వచ్చిన క, లక్కీ భాస్కర్ సినిమాలనే తీసుకోండి. ఈ సినిమాలకు క్లైమాక్స్ ప్రాణం.

2 / 5
 మరీ ముఖ్యంగా క సినిమాకు క్లైమాక్స్ ఆయువు పట్టు. రెండున్నర గంటల క సినిమాలో చివరి 2 నిమిషాల్లోనే ట్విస్ట్ రివీల్ చేసారు దర్శకలు ద్వయం సుజీత్, సందీప్. వాళ్ల రైటింగ్‌కు ఫిదా అవ్వని ఆడియన్స్ లేరేమో..?

3 / 5
 ఆ క్లైమాక్స్ కారణంగానే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. మిగిలిన సినిమా అంతా ఎలా ఉన్నా.. చివరి 2 నిమిషాల వరకు కథను హోల్డ్ చేసారు దర్శకులు. ఇది కిరణ్ సబ్బవరం కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 

4 / 5
 అలాగే లక్కీ భాస్కర్ క్లైమాక్స్‌ కూడా అంతే. చివరి 5 నిమిషాల్లో వెంకీ అట్లూరీ మ్యాజిక్ చేసారు.హీరో 100 కోట్లు ఇచ్చేయడంతో కథ ముగిస్తే లక్కీ భాస్కర్ మంచి సినిమా అయ్యుండేది.. కానీ అక్కడ్నుంచే వెంకీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలైంది.

5 / 5
తాజాగా గేమ్ ఛేంజర్ క్లైమాక్స్‌నూ అలాగే డిజైన్ చేస్తున్నారు శంకర్. బేసిక్‌గానే అపరిచితుడు, రోబో, 2.0 లాంటి సినిమాల్లో క్లైమాక్స్ అదిరిపోతుంది. గేమ్ ఛేంజర్ వీటికి మించి ఉంటుందని తెలుస్తుంది. అదెలా ఉండబోతుందో తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.