
తమిళంలో విజయ్‌కు ఉన్న మార్కెట్ గురించి చెప్పడానికేం లేదు.. ఆయన సినిమా వచ్చిందంటే టాక్‌తో పనిలేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాపైనా.. వరల్డ్ వైడ్‌గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది.

తాజాగా జన నాయగన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని ప్రకటించారు దళపతి. ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు విజయ్. ప్రస్తుతం పాలిటిక్స్‌తో పాటు సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇకపై మాత్రం కేవలం రాజకీయాలే అంటూ క్లారిటీ ఇచ్చారీయన. అందుకే జన నాయగన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను వినోద్ తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు విజయ్.

కేవలం రెమ్యునరేషన్ విషయంలోనే కాదు.. బిజినెస్ పరంగానూ విజయ్ చివరి సినిమా రికార్డులు తిరగరాస్తుంది. కేవలం ఓవర్సీస్‌లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి.

అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి జన నాయగన్. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. 2025 సెప్టెంబర్ అని ప్రకటించారు గానీ సంక్రాంతి 2026కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమా.