National Awards: ఢిల్లీలో రెపరెపలాడిన తెలుగు సినిమా జెండా.. తెలుగు చిత్రాలపై అవార్డుల వర్షం..

| Edited By: Prudvi Battula

Oct 18, 2023 | 11:53 AM

ఢిల్లీ తెలుగు సినిమా జెండా రెపరెపలాడింది. ఒక్కటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్‌కు పైగా అవార్డుల్లో సత్తా చూపించిన మన సినిమా గొప్పతనం రాష్ట్రపతి భవన్‌లో కనిపించింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట్టి రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ సహా అవార్డులు సాధించిన అందరూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా వాటిని స్వీకరించారు. ఆ ఈవెంట్‌పై స్పెషల్ స్టోరీ.. 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘ‌నంగా జరిగింది.

1 / 5
ఢిల్లీ తెలుగు సినిమా జెండా రెపరెపలాడింది. ఒక్కటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్‌కు పైగా అవార్డుల్లో సత్తా చూపించిన మన సినిమా గొప్పతనం రాష్ట్రపతి భవన్‌లో కనిపించింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట్టి రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ సహా అవార్డులు సాధించిన అందరూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా వాటిని స్వీకరించారు. ఆ ఈవెంట్‌పై స్పెషల్ స్టోరీ..

2 / 5
69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘ‌నంగా జరిగింది. దేశ వ్యాప్తంగా ప‌లు భాష‌ల‌కు సంబంధించిన చిత్రాలు ఈ అవార్డుల‌కు పోటీప‌డ్డాయి.

3 / 5
ఆగస్ట్ 29న అవార్డ్స్ ప్రకటన జరగ్గా.. అక్టోబర్ 17న వాటిని అవార్డ్ గ్రహీతలకు ప్రధానం చేసారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రాజమౌళి, కీరవాణి, దేవీ సహా చాలా మంది హాజరయ్యారు.

4 / 5
తెలుగు సినిమా చరిత్రలో తొలసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. పుష్పలో నటనకు గానూ 2021 సంవత్సరపు ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు బన్నీ. అలాగే ఉత్తమ చిత్రంగా ట్రిపుల్ ఆర్‌.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌లో సాంగ్స్‌కు దేవీ.. బ్యాగ్రౌండ్ స్కోర్‌కు కీరవాణి.. కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్ అవార్డులు స్వీకరించారు.

5 / 5
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీ సత్తా చూపించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ఉప్పెనకు గానూ మైత్రి మూవీ మేకర్స్ అవార్డు స్వీకరించారు. ఇక బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎంపికైన కృతి సనన్, అలియా భట్ రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిగిలిన అవార్డు గ్రహీతలు కూడా పాల్గొన్నారు. కన్నుల పండగగా నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుక జరిగింది.