అది కావాలి.. ఇది కావాలి అంటున్న టాలీవుడ్ హీరోలు..

Edited By: Phani CH

Updated on: Jul 17, 2025 | 10:11 PM

హీరోలు కేవలం నటనపైనే ఫోకస్ చేయాలి.. దర్శకులు డైరెక్షన్ మాత్రమే చేయాలి అనుకునే రోజులు కావివి. అందరూ అన్నీ చేస్తున్నారు.. అందులో మన హీరోలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ కేవలం నటనపైనే ఫోకస్ చేసిన వాళ్లు ఇప్పుడు పెన్ను పడుతున్నారు.. నచ్చింది రాస్తున్నారు.. స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు.. ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు.

1 / 5
ఎవరో రావాలి.. మనకేదో చేయాలి.. మన కెరీర్‌ను పైకి తీసుకురావాలి అని ఎదురు చూసే రోజులు పోయాయి. వాళ్ల కెరీర్‌ను వాళ్లే లిఫ్ట్ చేసుకుంటున్నారు మన హీరోలు. కథలు వాళ్లే రాసుకుంటున్నారు.. కుదిర్తే పాటలు కూడా వాళ్లే రాస్తున్నారు.

2 / 5
తాజాగా రామ్ పోతినేని లిరిక్ రైటర్ అయిపోయారు.. కొత్త సినిమా కోసం పాట రాసారీయన. మహేష్ దర్శకత్వంలో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూక కోసం పాట రాసారు రామ్. జూలై 18న విడుదల కానుంది ఈ పాట.

3 / 5
ఐ లవ్ యూ అనే పదాలు లేకుండా ప్రేమ గురించి వివరిస్తూ తనలోని లిరిసిస్ట్‌ను బయటికి తెస్తున్నారు రామ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. వివేక్ మార్విన్ సంగీతం అందిస్తుండగా.. అనిరుధ్ పాడారు.

4 / 5
మొన్నామధ్య లైలాలో ఓ పాట రాసారు విశ్వక్ సేన్. కేవలం పాటలు మాత్రమే కాదు.. ఇంకా చాలా చేస్తున్నారు మన హీరోలు. డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ మాత్రమే కాదు.. మిగిలిన డిపార్ట్‌మెంట్స్‌లో అడుగేస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు మల్టీ టాలెంట్ చూపిస్తున్నారు. ఎవరికి వాళ్లే సొంత కథలు రాసుకుంటున్నారు.

5 / 5
తమ కెరీర్ కష్టాల్లో ఉన్నపుడు ఎవరి కోసం వేచి చూడకుండా.. వాళ్లకు వాళ్ళే మంచి కథలు రాసుకుంటున్నారు. డిజే టిల్లుతో సిద్ధూ.. ఏజెంట్ ఆత్రేయతో నవీన్ పొలిశెట్టి.. క్షణంతో అడివి శేష్.. ఎస్ఆర్ కళ్యాణమండపంతో కిరణ అబ్బవరం నిలబడింది వాళ్ల సొంత కథలతోనే..! తాజాగా రామ్ సైతం ఈ లిస్టులో చేరిపోయారు.. లిరిసిస్ట్ అయిపోయారు..!