
వసూళ్ల విషయంలోనే కాదు వాయిదాల విషయంలోనూ రికార్డ్‌లు సృష్టిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ సినిమా అంటే చెప్పిన డేట్‌కు రావటం కష్టమే అన్న నిర్ణయానికి వచ్చేశారు ఫ్యాన్స్.

రాజాసాబ్ విషయంలోనూ ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను చాలా వాయిదాల తరువాత డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఆ డేట్‌కు రావటం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకపోవటంతో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా భారీగా ఉండటంతో రిలీజ్ ఆలస్యమవుతోంది.

రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సమ్మె కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో చెప్పిన టైమ్ ఈ సినిమా రావటం కష్టమే అనిపిస్తోంది. నిర్మాత నాగవంశీ కూడా తన లేటెస్ట్ ట్వీట్‌లో రిలీజ్‌డేట్ కమిట్ అవ్వకపోవటంతో వాయిదా పడటం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.

గ్రాఫిక్స్ కారణంగానే ఆలస్యమవుతున్న మరో మూవీ మిరాయ్. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయికి తగ్గ అవుట్‌పుట్ ఇచ్చేందుకు మేకర్స్ టైమ్ తీసుకుంటున్నారు. అందుకే సెప్టెంబర్ 5న రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా ఆ డేట్‌కు రావటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఆన్ సెట్స్ ఉన్న సినిమాల వాయిదా వార్తలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి.