
2025లో విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ముందుండేది కోర్ట్. నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన కోర్ట్ సినిమా సంచలన విజయం సాధించింది.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా కనిపించారు. కోర్ట్ సినిమాకు కలెక్షన్లు మాత్రమే కాదు.. ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి.

పోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు దర్శకుడు రామ్ జగదీష్. ఈ పాయింట్ బాగా డీల్ చేయడంతో కోర్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఓటిటిలో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.

ఇలాంటి సమయంలో దీన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారిప్పుడు. కోర్ట్ తమిళ హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కీలక పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో కృతిక్, ఇనియా జంటగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ ఈ మధ్య జులాయి, అంధాధూన్ లాంటి రీమేక్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కోర్ట్ రీమేక్ వైపు అడుగులేస్తున్నారు.