Kollywood: తెలుగు సినిమాను సవాల్ చేస్తున్న తమిళ ఇండస్ట్రీ

| Edited By: Phani CH

Sep 19, 2023 | 4:24 PM

మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతుంటే.. మేమే మిమ్మల్ని ఆపేది అంటుంది తమిళ ఇండస్ట్రీ. ఉన్నట్లుండి అంత ధైర్యం వాళ్లెందుకు వచ్చింది.. టాలీవుడ్‌ను బీట్ చేసేంత సత్తా కోలీవుడ్‌కు ఉందా అంటే ఉంది.. వాళ్ళ చేతిలో కొన్ని సినిమాలున్నాయిపుడు.. వాటిని చూసుకునే వాళ్లకంత నమ్మకం. అవి క్లిక్ అయితే.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు.. ఒకప్పుడు బాలీవుడ్‌ను చూసి అందని ద్రాక్ష అనుకున్న వాళ్లే.. ఇప్పుడు ఒక్క సినిమాతో 1000 కోట్లు వసూలు చేస్తున్నారు.

1 / 5
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతుంటే.. మేమే మిమ్మల్ని ఆపేది అంటుంది తమిళ ఇండస్ట్రీ. ఉన్నట్లుండి అంత ధైర్యం వాళ్లెందుకు వచ్చింది.. టాలీవుడ్‌ను బీట్ చేసేంత సత్తా కోలీవుడ్‌కు ఉందా అంటే ఉంది.. వాళ్ళ చేతిలో కొన్ని సినిమాలున్నాయిపుడు.. వాటిని చూసుకునే వాళ్లకంత నమ్మకం. అవి క్లిక్ అయితే.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 5
తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు.. ఒకప్పుడు బాలీవుడ్‌ను చూసి అందని ద్రాక్ష అనుకున్న వాళ్లే.. ఇప్పుడు ఒక్క సినిమాతో 1000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీనే ఇప్పుడు టాప్‌లో ఉంది. అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ చేస్తున్నారిప్పుడు. అంత ధైర్యమేంటి అనుకోవచ్చు.. కానీ వాళ్ల ప్లాన్స్ వాళ్లకున్నాయి.

3 / 5
పాన్ ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే.. ఎందుకంటే కాంతార, కేజియఫ్ మినహాయిస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు సినిమాలే. తమిళం నుంచి విక్రమ్, పొన్నియన్ సెల్వన్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కవుట్ అవ్వలేదు. కేవలం తెలుగు, తమిళంలోనే విజయం సాధించాయే కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటి వరకు సత్తా చూపింది లేదు.

4 / 5
ఈ మధ్య మన పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, దేవర, గేమ్ ఛేంజర్ లాంటి వాటితో దండయాత్రకు రెడీ అవుతున్నారు మన హీరోలు. కానీ ఫస్ట్ టైమ్ తమిళ హీరోల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ కనిపిస్తున్నాయి. దానికి అక్కడున్న కంటెంట్ కారణం. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా వస్తుంది. అలాగే సూర్య కంగువాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

5 / 5
సూర్య, శివ కాంబినేషన్‌లో వస్తున్న కంగువాపై తమిళ ఇండస్ట్రీ భారీ ఆశలే పెట్టుకుంది. అలాగే లియోతో విజయ్ ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొడతారని నమ్ముతున్నారు వాళ్లు. ధనుష్‌కు ఎలాగూ బాలీవుడ్ మార్కెట్ ఉంది కాబట్టి ఇటు కెప్టెన్ మిల్లర్, అటు శేఖర్ కమ్ముల సినిమాలతో బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. ఇలా తమిళ హీరోలంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారిప్పుడు. ఇవి సరిగ్గా వర్కవుట్ అయితే.. టాలీవుడ్‌కు గట్టి పోటీ ఇస్తారు వాళ్లు.