2 / 5
ఇన్నాళ్లూ కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న అరవ హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలోనే రజినీ, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్‌తో పని చేస్తున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజినీ సినిమా ఖరారైంది.