- Telugu News Photo Gallery Cinema photos Tamil heroes like suriya dhanush Siva karthikeyan Rajinikanth Kamal Haasan are insterested to movies in bollywood
Tamil Heroes: బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్న తమిళ హీరోలు
ప్రపంచం అంతా ఓ వైపు వెళ్తుంటే.. తమిళ హీరోలు మాత్రం ఓ వైపు వెళ్తుంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు తీస్తుంటే.. వాళ్లు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి..? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్‌తో దూసుకొస్తున్నారు. మరి తమిళ హీరోలు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి..? ఇన్నాళ్లూ కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న అరవ హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి.
Updated on: Jul 05, 2024 | 4:37 PM

ప్రపంచం అంతా ఓ వైపు వెళ్తుంటే.. తమిళ హీరోలు మాత్రం ఓ వైపు వెళ్తుంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు తీస్తుంటే.. వాళ్లు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి..? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్‌తో దూసుకొస్తున్నారు. మరి తమిళ హీరోలు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి..?

ఇన్నాళ్లూ కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న అరవ హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలోనే రజినీ, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్‌తో పని చేస్తున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజినీ సినిమా ఖరారైంది.

కోలీవుడ్‌లో టాప్ గేర్‌లో ట్రావెల్ చేస్తున్న విజయ్ అండ్ అజిత్.. కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది.

తమిళంలో పాటు హిందీ, తెలుగులోనూ వరస సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఆయనకు అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరోవైపు శివకార్తికేయన్ ఈ మధ్యే ఓ బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళంపై ఫోకస్ చేసారు శివకార్తికేయన్.

కమల్ హాసన్, మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు. 1987లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ 100 మూవీస్‌లో చోటు దక్కించుకుంది. అలాంటి క్లాసిక్ కాంబో 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుంది.




