
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్‌లైఫ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది.

అయితే బీ కూల్.. అంటూ వెళ్లినవాళ్లు ఒక్కొక్కరిగా తిరిగి వచ్చేశారు. ఈ ఏడాది అంగరంగవైభవంగా మొదలైంది మణిరత్నం థగ్‌లైఫ్ షూటింగ్. నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్‌హాసన్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు మూవీ లవర్స్.

కమల్‌తో పాటు దుల్కర్ సల్మాన్, జయం రవి నటిస్తారనే వార్తలు కూడా అఫిషియల్‌గానే వినిపించాయి. అయితే అంతలోనే సారీ మణిసార్ అని చెబుతూ దుల్కర్, రవి డ్రాప్ అయ్యారు.అప్పటికే బ్యాక్ టు బ్యాక్ మణిరత్నం సినిమాల్లో నటించారు జయం రవి.

ముచ్చటగా మూడో సారి నటించాలని ఎంత ట్రై చేసినా.. కాల్షీట్లు కుదరకపోవడంతో సారీ చెప్పారు రవి. ఓకే బంగారం లాంటి హిట్ మూవీ ఉన్నా, కమల్‌తో పనిచేయాలన్న కోరిక ఉన్నా, సినిమా నుంచి తప్పుకోక తప్పట్లేదని బాధపడ్డారు సిల్వర్ స్క్రీన్ లక్కీ భాస్కర్ మిస్టర్ దుల్కర్.

కాల్షీట్ల సమస్యతో వెళ్లిన దుల్కర్ అండ్ రవి.. ఇప్పుడు మణి అండ్ కమల్ కోసం తిరిగి వచ్చేస్తున్నారు. వీరిద్దరికీ శింబు కూడా యాడ్ అయ్యారు. అందులోనూ థగ్‌లైఫ్లో ఆయనది డ్యూయల్ రోల్. పోస్ట్ ఎలక్షన్స్ వీళ్లందరితో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

సైబీరియా, ఢిల్లీ, చెన్నైలో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు మణి... రీసెంట్‌గా మల్టీస్టారర్‌గా విక్రమ్ చేసిన కమల్.. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌కి రెడీ అవ్వమని ఫ్యాన్స్ కి సిగ్నల్స్ ఇస్తున్నారు.