
ఒకప్పుడు సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా అనౌన్స్ అయినా, హీరోయిన్‌గా తమన్నా పేరు వినిపించేది. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమన్నా ఇండస్ట్రీలో లేరా.. అంటే లేకపోలేదు. అలాగని టాప్‌లో ఉన్నారా? అని అడిగితే 'బిగ్ నో' అనే ఆన్సర్ వినిపిస్తుంది. ఈ ఆన్సర్‌ని వీలైనంత త్వరగా చెరిపేయాలనే ప్రయత్నంలో ఉన్నారు తమన్నా.

సినిమాల్లో నాయికగానే కాదు, ఓటీటీల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ అడపాదడపా డిజిటల్ ఆడియన్స్ కి కూడా చేరువవుతున్నారు తమన్నా. అంతే కాదు, స్పెషల్ సాంగులు చేస్తూ, వారెవా అనిపించుకుంటున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి నుంచే స్పెషల్ సాంగులు చేస్తున్నప్పటికీ, ఈ మధ్య తమన్నా చేస్తున్న ఐటమ్ సాంగ్స్ గురించి మాత్రం స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు జనాలు.

జైలర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిన వాటిలో తమన్నా వా కావాలయ్యా సాంగ్ కూడా ఒకటి. అలాగే స్త్రీ2 సక్సెస్‌ని తమన్నా స్పెషల్ సాంగ్‌కి కూడా షేర్ చేశారు మేకర్స్. అంత క్రేజ్ ఉంది కాబట్టే ఇప్పుడు అజయ్ దేవ్‌గణ్ మూవీలోనూ తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు. రైడ్2లో తమన్నా, హనీ సింగ్ కలిసి సాంగ్ చేస్తారనే టాక్ ఇలా స్ప్రెడ్ అయిందో లేదో.. అందరూ హిమ్మత్‌వాలాని గుర్తుచేసుకుంటున్నారు.

మిల్కీ బ్యూటీ జస్ట్ ప్రాజెక్టుల మీదే ఫోకస్ చేసి కాలాన్ని గడిపేయడం లేదు. ఆమె ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులతో పాటు బంధువులతో కలిసి అమ్మవారి పూజలు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఆమె ఇంట్లో నిర్వహించిన పూజలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

తెలుగులో ఓదెల2లో నటిస్తున్నారు ఈ టాలెంటెడ్ నటి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముందు వారణాసికి వెళ్లొచ్చారు. ఈ మధ్య మహాకుంభ్‌లోనూ పాల్గొన్నారు తమన్నా. విజయ్ వర్మతో విడిపోయాక తమన్నా మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారనే నిర్ణయానికి వచ్చారు అభిమానులు. అందుకే ఆమె పనికి, ఫ్యామిలీకి ప్రాధాన్యమిస్తున్నారంటున్నారు