
Tapsee ఔట్‌సైడర్స్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ని స్టార్ట్ చేశారు తాప్సీ. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్బంగా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆలోచించినట్టు తెలిపారు తాప్సీ. ఈ బ్యానర్ మీదే బ్లర్ మూవీని తెరకెక్కించారు. అడపాదడపా పలువురు హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నా, వీళ్లు మాత్రం డెడికేటెడ్‌గా సినిమాలు తీస్తామని పదే పదే చెబుతున్నారు.

ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.

తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ.. నార్త్‌లో మాత్రం పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో దూసుకుపోతున్నారు.

నటిగానే కాదు నిర్మాతగానూ నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు తాప్సీ పన్ను.

సోషల్ ఇష్యూ ద స్పందించటం, తన మీద వచ్చే విమర్శలకు సమాధానం చెప్పటం లాంటివి సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు.ఇదే తరహాలో సోషల్ మీడియాలో కూడా తనదైన అందంతో కుర్రహృదయాలను ఉర్రుతలూగిస్తుంది.