
ప్రజెంట్ బాలీవుడ్‌లో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టార్స్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు మోస్ట్ టాలెంటెడ్ తాప్సీ పన్ను. ఇన్నాళ్లు తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ప్రొఫెషనల్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్న ఈ బ్యూటీ... ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతా అంటున్నారు.

తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి సూపర్ సక్సెస్ అయిన బ్యూటీ తాప్సీ పన్ను. స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు ఈ బ్యూటీ, లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కెరీర్ కాస్త గాడి తప్పినా.. ఒక్క హిట్ పడితే తాప్సీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వటం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

ప్రొఫెషనల్ కెరీర్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు తాప్సీ. చాలా కాలంగా డెన్మార్క్ స్పోర్ట్స్ పర్సన్ మాథ్యూస్ బోతో రిలేషన్‌ఫిప్‌లో ఉన్నారు తాప్సీ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా కన్ఫార్మ్ చేశారు కూడా. అయితే ఇన్నాళ్లు పెళ్లి విషయంలో వాయిదా వేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఫైనల్‌గా వెడ్ లాక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దాదాపు దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది సమ్మర్‌లో పెళ్లికి సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో సెల్రబిటీ వెడ్డింగ్‌కు ఫస్ట్ డెస్టినేషన్‌గా ఉన్న ఉదయ్‌పూర్‌లోనే తాప్సీ పెళ్లి కూడా జరగనుందన్నది బీటౌన్‌లో హాట్ న్యూస్. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా... బాలీవుడ్‌లో తాప్సీ వెడ్డింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.