
సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా గుర్తుందిగా! సీన్స్, ఎమోషన్స్ అన్నీ నెక్స్ట్ రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. నేషనల్ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా సిద్ధమవుతోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించే లేటెస్ట్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కీ రోల్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సూర్య.. స్టూడెంట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తన యాక్చువల్ ఏజ్ కన్నా, తక్కువ వయసున్న వాడిగా స్క్రీన్ మీద కనిపించడం సూర్యకి ఇదేం తొలిసారి కాదు. ప్రస్తుతం సెట్స్ మీదున్న కంగువలోనూ పది రోల్స్ లో నటిస్తున్నారు సూర్య. త్వరలోనే సుధ సెట్స్ లో స్టూడెంట్‌గా తిరగడానికి రెడీ అంటున్నారు నడిప్పిన్ నాయగన్.

జైలర్ సినిమా విడుదలయ్యాక హీరోల ఆలోచనా విధానం కాసింత మారిందనే చెప్పాలి. తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓల్డ్ గెటప్‌లో హీరోగా అదరగొట్టేశారని అంతా అనుకున్నారు. అందుకే మెల్లిగా ఏజ్డ్ రోల్స్ వైపు హీరోలు కూడా మొగ్గుచూపుతున్నారు. లేటెస్ట్ గా ఓ అడుగు ముందుకేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి.

విశ్వంభర సినిమాలో ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తారట చిరు. గతంలోనూ ఆయన స్నేహం కోసం, శ్రీమంజునాథలో అలా కనిపించారు. ఇప్పుడు విశ్వంభరలో డబుల్ యాక్షన్‌లో నటిస్తారట. అందులో ఒకటి వయసుమళ్లిన పాత్ర అని వినికిడి. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభరలో ఐదుగురు హీరోయిన్లుంటారు.

మిస్టర్ ఉప్పీ.. అదేనండీ ఉపేంద్ర అనగానే మనకు ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా గుర్తుకొచ్చేస్తాయి కదా. చేసిన సినిమాలు అనగానే, యాక్ట్ చేసిన సినిమాలు... అనే కదా అనుకుంటాం! కానీ ప్రశాంత్ నీల్‌కి మాత్రం ఉప్పీ యాక్ట్ చేసిన సినిమాలు గుర్తు రావట. ఉపేంద్ర డైరక్ట్ చేసిన సినిమాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయట. ఆయన విజన్, ఆయన డైరక్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటారు ప్రశాంత్ నీల్. తనను మొదటి నుంచీ కన్నడ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈ మాట చెప్పడం లేదని అంటారు ప్రశాంత్. మనస్ఫూర్తిగా ఉపేంద్ర సినిమాలను ఇష్టపడతానని, ఏ స్టేజ్ మీదయినా ఇదే విషయాన్ని చెబుతానని అన్నారు సలార్ కెప్టెన్.