5 / 5
యష్‌రాజ్ ఫిల్మ్స్ లో స్పై యూనివర్శ్ సినిమా చేస్తున్నారు ఆలియాభట్. ఈ సినిమాలో పఠాన్‌కి ఆలియా అంగరక్షకురాలిగా కనిపిస్తారట. యష్ రాజ్ స్పై యూనివర్శ్‌లో ఫీమేల్ యాక్టర్స్ లీడ్‌గా తెరకెక్కే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఆల్రెడీ కత్రినా కైఫ్, దీపిక పదుకోన్‌కి స్పై యూనివర్శ్ గర్ల్స్ గా పేరుంది. అయితే వారిద్దరూ టైగర్‌తోనూ, పఠాన్‌తోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని సందడి చేశారు. టైగర్‌గానీ, పఠాన్‌గానీ, కబీర్‌గానీ లేకుండా తెరకెక్కుతోంది ఆలియా సినిమా. అయితే ఆలియా సినిమాలో పఠాన్ ప్రస్తావన ఉంటుందన్నది లేటెస్ట్ గా బాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. ది రైల్వే మెన్ సీరీస్‌ని తెరకెక్కించిన శివ్ రవైల్ ఇప్పుడు ఆలియా సినిమాకు డైరక్టర్.