
జైలర్ సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న రజనీకాంత్, త్వరలో లాల్ సలాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించి తాను తీసుకున్న కొన్ని స్ట్రిక్ట్ డెషిషన్స్ గురించి రివీల్ చేశారు.

ఇంతకీ రజనీ తీసుకున్న నిర్ణయమేంటి..? హావ్ ఏ లుక్. జైలర్ సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కూతురి కోసం లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.

లాంగ్ గ్యాప్ తరువాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న తలైవా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

లాల్ సలాం సినిమా ఎనౌన్స్ అయిన టైమ్‌లో కూతురి కోసం ఈ సినిమాను రజనీకాంత్ నిర్మిస్తే బాగుండేది అన్న కామెంట్స్ వినిపించాయి.ఈ కామెంట్స్ మీద స్పందిస్తూ తాను ఇక ఎప్పటికీ నిర్మాతగా సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.

రజనీకాంత్ స్వయంగా కథ అందించి, నటించి, నిర్మించిన సినిమా బాబా. తలైవా ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఆర్ధికంగానూ రజనీకాంత్‌ను ఇబ్బంది పెట్టింది బాబా.

అందుకే ఆ సినిమా తరువాత మళ్లీ ఎప్పటికీ నిర్మాణం రంగంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట రజనీ. అందుకే లాల్ సలాం సినిమా కథ విన్న వెంటనే తానే ఓ మంచి నిర్మాతను సజెస్ట్ చేసి, ఐశ్శర్యను కథ చెప్పమని పంపించా అన్నారు రజనీకాంత్.

ఈ సినిమాతో పాటు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టయన్ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్.