
బిజినెస్‌మేన్.. 12 ఏళ్ళ కింద మహేష్ బాబుకు ఏ ముహూర్తంలో పూరీ జగన్నాథ్ ఈ టైటిల్ పెట్టారో తెలియదు కానీ.. దాన్ని నిజం చేస్తున్నారు సూపర్ స్టార్. ఆయన చేస్తున్నది కూడా మామూలు బిజినెస్ కాదు.. దేశం మొత్తం మహేష్ బ్రాండ్ కనిపించాలంతే అంటున్నారు.

తాజాగా మరో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారీయన. మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నారో.. బిజినెస్‌లోనూ అంతే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ వైపు మహేష్ మనసు మళ్లుతుంది.

ఇప్పటికే AMB సినిమాస్‌తో తొలి అడుగులోనే సూపర్ సక్సెస్ అయ్యారీయన. ఇదే బిజినెస్‌ను మరింత విస్తరింపజేయాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు. అందుకే మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగం అవుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టిందే మహేష్ బాబు. ఏషియన్ వాళ్లతో కలిసి AMB సినిమాస్ ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌గా వెలుగుతుంది. మహేష్‌ను చూసి విజయ్ దేవరకొండ AVD సినిమాస్, అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలుపెట్టారు.

త్వరలోనే రవితేజ కూడా ఓ మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. AMB సినిమాస్ ఉండగానే.. RTC క్రాస్ రోడ్స్‌లో ఏసియన్‌తోనే కలిసి AMB క్లాసిక్ ప్లాన్ చేస్తున్నారు మహేష్. RTC క్రాస్ రోడ్స్‌కు, మహేష్ బాబుకి మంచి విడదీయరాని అనుబంధం ఉంది.

ఎన్నో సినిమాలు అక్కడ సిల్వర్ జూబ్లీస్ ఆడాయి. ముఖ్యంగా సుదర్శన్ 35 MMను తమ కోటగా భావిస్తారు మహేష్ ఫ్యాన్స్. అలాంటి చోటే ఇప్పుడు AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్. సుదర్శన్ 70 MM ఉన్న చోటే 7 స్క్రీన్లతో AMB క్లాసిక్ పేరుతో ఏషియన్ భాగస్వామ్యంలో మహేష్ మల్టీప్లెక్స్ రాబోతుందని తెలుస్తుంది.

RTC క్రాస్ రోడ్స్ అంటే ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ అడ్డా.. అలాంటి చోట మల్టీప్లెక్స్ కడితే ప్రభావం ఎలా ఉంటుందో..? హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశమంతా మల్టీప్లెక్స్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు సూపర్ స్టార్.