
హీరో ఇమేజ్‌కు కాంట్రస్ట్ కథలను ఎంచుకొని వెండితెర మీద ప్రయోగాలు చేస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ఊరమాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ అవతార్‌లో చూపించి మెప్పించారు.

క్లాస్ ఇమేజ్ ఉన్న రాంచరణ్‌ను రంగస్థలం సినిమా కోసం ఊరమాస్‌గా చూపించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ఫ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు సుక్కు.

స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్‌ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో మాస్ లుక్‌లోకి మార్చేశారు. ఈ సినిమా నేషనల్ మార్కెట్‌ను షేక్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. హీరోల ఇమేజ్‌ను మార్చటం సుకుమార్‌కు బాగా కలిసొచ్చింది.

అందుకే నెక్ట్స్ మూవీ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు లెక్కల మాస్టర్. రామ్ చరణ్ హీరోగా నెక్ట్స్ మూవీ చేస్తానని ఆల్రెడీ కన్ఫార్మ్ చేసిన సుక్కు... ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ప్రజెంట్ పెద్ది సినిమాలో మాస్ హీరోగా కనిపిస్తున్న రామ్ చరణ్‌ను నెక్ట్స్ మూవీలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించే ప్లాన్‌లో ఉన్నారు సుకుమార్. పుష్ప తరువాత మళ్లీ మాస్ మూవీ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ వెండితెర మీద కనకవర్షం కురిపిస్తోంది.