
నయా గ్లామర్... ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతుంటే, సీనియర్లు సైడ్ ఇవ్వాల్సిందే. అందులోనూ యంగ్‌స్టర్స్ ఇంకాస్త దూకుడుమీదుంటే, స్టార్ హీరోయిన్స్ సైలెంట్‌గా ఇంకో రూట్ చూసుకోవాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి ట్రాన్స్ ఫర్మేషన్ కనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన స్టెప్పులేసిన వాళ్లు ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీలకు సై అంటున్నారు. అలాంటి వారిలో శ్రీలీల ఒకరు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగినా, హీరోయిన్ ఎవరు? ఆ ఇద్దరిలో ఒకరేనా అంటూ శ్రీలీల, మృణాల్ ఠాకూర్ పేర్లను ప్రస్తావిస్తున్నారు జనాలు. వరుస సక్సెస్‌లతో శ్రీలీల దూసుకుపోతుంటే, సౌత్, నార్త్ తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మృణాల్ ఠాకూర్. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరూ.

క్రేజీ ఆఫర్స్ అన్నీ యంగ్‌స్టర్స్ ని చుట్టుముడుతుంటే, మెల్లిగా సైడ్ ఇస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. రకుల్ అయితే నార్త్ లో సీనియర్ హీరోల సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయారు.

నేషనల్ క్రష్ రష్మిక కూడా సౌత్ కన్నా, నార్త్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సౌత్‌లో చేసే సినిమాల్లోనూ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆమె నటిస్తున్న రెయిన్‌బో ఆ కైండ్ ఆఫ్ మూవీనే.

మిగిలిన హీరోయిన్లు ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్ కోసం వెతుక్కుని ప్రూవ్ చేసుకోవాలి. కానీ కీర్తీ సురేష్ అంత ట్రై చేయక్కర్లేదు. ఆమెకు ఆల్రెడీ మహానటి సూపర్ సక్సెస్ ఉంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా అది. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరోతో మూవీ చేసినా, సైడ్‌లో తప్పకుండా ఫీమేల్ కంటెంట్‌కి ఓటు వేస్తూనే ఉంటారు కీర్తి.

రీసెంట్ టైమ్స్ లో తమన్నకు పేరు తెచ్చిపెట్టిన కంటెంట్ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడే. జీ కర్దా, లస్ట్ స్టోరీస్2 లో తమన్నా పెర్ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆగస్టులో రెండు రిలీజులున్నాయి తమన్నాకు. అయినా ఫ్యూచర్ మాత్రం కంటెంట్ బేస్డ్ ప్రాజెక్టుల్లోనే అని ఫిక్స్ అయ్యారు తమన్నా. ఆల్రెడీ సేమ్ రూట్లోనే ఉన్నారు కాజల్ అండ్ అదర్ సీనియర్స్.