- Telugu News Photo Gallery Cinema photos Star Hero Rajinikanth and Mani Ratnam Combo Again After 33 Years, dalapathi movie Telugu Heroes Photos
Mani Ratnam: 33 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ – మణిరత్నం కాంబో.?
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న మణి, నెక్ట్స్ అంతకు మించి అన్న రేంజ్‌లో మరో కాంబోను సెట్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ కోలీవుడ్ మార్కెట్‌కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్ ఇచ్చింది.
Updated on: Oct 09, 2024 | 8:14 PM

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

అది కూడా రెండూ పాన్ ఇండియా సినిమాలే కావటంతో బాక్సాఫీస్ నెంబర్ కొత్త హైట్స్ చూడటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ కోలీవుడ్ మార్కెట్‌కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్ ఇచ్చింది. వరుస ఫెయిల్యూర్స్ తరువాత మణి మళ్లీ ఫామ్‌లోకి రావటంతో టాప్ స్టార్స్ కూడా ఈ లెజెండరీ డైరెక్ట్‌తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రభాస్, విక్రమ్ తరువాత పాన్ ఇండియా రేంజ్‌లో మళ్లీ క్రేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ ముఖా ముఖి తలపడుతుండటం,

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ సినిమాను సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో 2025 ఏప్రిల్ 10న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ క్లాష్ తప్పదని తేలిపోయింది.

1991లో రిలీజ్ అయిన దళపతి సినిమా కోసం రజనీకాంత్, మణిరత్నం కలిసి పనిచేశారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబో మళ్లీ రిపీట్ కాలేదు.

33 ఏళ్ల తరువాత మరోసారి రజనీకాంత్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు మణి. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.




