- Telugu News Photo Gallery Cinema photos Star Boy siddhu jonnalagadda movie tillu square Movie release date and shooting details Telugu Heroes Photos
Siddhu Jonnalagadda – Tillu Square: టిల్లు గాడు ఏం పాపం చేసాడో.. పాపం సిద్ధూ సినిమా మళ్లీ వాయిదా.!
భలే ఉంది ఇది.. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లే నామీద పడతారేంటి అంటూ అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..? ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు ఇది బాగా సూట్ అవుతుంది. సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ అటూ ఇటూ తిరిగి డిజే టిల్లుపై పడింది. ఈ చిత్ర సీక్వెల్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మహేష్ బాబు కోసం సిద్ధూ జొన్నలగడ్డ సినిమాను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Praveen Vadla | Edited By: Anil kumar poka
Updated on: Jan 05, 2024 | 9:37 PM

భలే ఉంది ఇది.. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లే నామీద పడతారేంటి అంటూ అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..? ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు ఇది బాగా సూట్ అవుతుంది. సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ అటూ ఇటూ తిరిగి డిజే టిల్లుపై పడింది.

ఈ చిత్ర సీక్వెల్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మహేష్ బాబు కోసం సిద్ధూ జొన్నలగడ్డ సినిమాను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకున్న తేదీకి రావడం కష్టమే అని తేలిపోయిందిప్పుడు.

తన సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందని తెలిసిన తర్వాత సిద్ధూ కూడా షాక్ అవ్వక తప్పదు. అంత విచిత్రమైన పరిస్థితుల్లో తన రిలీజ్ డేట్ త్యాగం చేస్తున్నాడు ఈ హీరో. అదేంటి భయ్యా నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు.. నన్ను సోలోగా ఉండనివ్వరా ఏంటి అని నిర్మాతలను అడుగతాడేమో.?

అరే.! ఆగస్ట్‌లో సినిమాలెక్కువున్నాయి.. చిరంజీవి, రజినీ లాంటి పెద్దోళ్లతో మనకెందుకులే అని సైడ్ అయిపోయాడు సిద్ధూ.. ఆ తర్వాత కూడా సెప్టెంబర్‌లో అనుకున్నా అప్పుడు కూడా వద్దులే అని పక్కకు వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ కూడా కన్ఫ్యూజన్‌లో పడేసరికి పాపం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ హీరోకు.

ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా.. డిజే టిల్లుతో సిద్దూ జొన్నలగడ్డ ఇదే అయ్యాడు. అప్పుడెప్పుడో ఆరెంజ్ సినిమాలోనే నటించినా.. ఆ తర్వాత పదేళ్లు ఇండస్ట్రీలో కష్టపడినా రాని గుర్తింపు డిజే టిల్లుతో వచ్చింది ఈ కుర్రాడికి. దెబ్బకు కొడితే కుంభస్థలమే అన్నట్లు బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు టిల్లు భాయ్.

కామెడీ మూవీస్‌కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది డిజే టిల్లు.. మీమర్స్ అయితే సిద్ధూ జొన్నలగడ్డ డైలాగ్స్‌ను తెగ వాడేస్తున్నారు. డిజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌కు కథ, స్క్రీన్ ప్లే సిద్ధూనే అందిస్తున్నారు. ముందు ఈ సినిమాను 2023 ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకున్నారు.

అయితే అదే రోజు చిరంజీవి భోళా శంకర్.. దానికి ముందు రోజు జైలర్ రావడంతో వద్దులే అని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆ తర్వాత సైలెంట్‌గా సెప్టెంబర్ 15కి వెళ్లాడు టిల్లు భాయ్. సెప్టెంబర్ 15న సోలోగా వచ్చి కుమ్మేద్దాం అని ప్లాన్ చేసుకుంటే.. అదే రోజు విశాల్ మార్క్ ఆంటోనీతో పాటు మరో సినిమా కూడా వచ్చింది.

అబ్బా ఈ రచ్చ అంతా ఏంట్రా నాయనా.. నాకు 2023 వద్దు.. హాయిగా 2024 ఫిబ్రవరి 9న వచ్చేస్తానంటూ ఏకంగా నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ డేట్‌పై కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా కోసం సపోర్ట్ చేసిన ఈగల్ కోసం టిల్లు స్క్వేర్ సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ నిర్మాత నాగవంశీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు చెప్పాడు. ఈగల్ సోలో డేట్ ఇప్పించాలి కాబట్టి డిజే టిల్లు సీక్వెల్‌ను వాయిదా వేయడానికి నిర్మాత ఒప్పుకున్నట్లు తెలిపాడు రాజు. ఈ లెక్కన టిల్లు భాయ్ ముందుకొస్తాడా లేదంటే ఇంకా వెనక్కి వెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.





























