
మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలవ్వక ముందే వార్తల్లో నిలుస్తుంది. ఈ సినిమాకు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ఉందిప్పుడు. అయితే దీనికి MAH RAJ అంటే టైటిల్ పరిశీలనలో ఉంది. అంటే చక్రవర్తి అని అర్థం. ఇక్కడే మరో మతలబు కూడా ఉంది. మహేష్ బాబు, రాజమౌళి పేర్లలోని మొదటి మూడు అక్షరాల కలయికలో ఈ టైటిల్ వచ్చేలా సెట్ చేసారని ప్రచారం జరుగుతుంది.

హాస్య నటుడు వైవా హర్ష హీరోగా నటిస్తున్న సినిమా ‘సుందరం మాస్టర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చిరంజీవి విడుదల చేసారు. ఫిబ్రవరి 23న విడుదల కానుంది సుందరం మాస్టర్. ఇందులో హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటిస్తున్నారు. ఈ సినిమాను సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

RRR సహా ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి రూహి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించారు. రూహి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక సత్యభామ చిత్ర యూనిట్ కాజల్‌కు ప్రత్యేకంగా విషస్ తెలిపారు. కాజల్ ఇప్పటి వరకు నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌తో వీడియోను విడుదల చేసారు మేకర్స్.

అభిషేక్ పచ్చిపాల, నజియా ఖాన్ జంటగా పూర్ణస్ యశ్వంత్ తెరకెక్కిస్తున్న సినిమా జస్ట్ ఏ మినిట్. ఈ చిత్రం నుంచి తాజాగా నువ్వంటే యిష్టం అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తుందంటూ దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.