
అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, మొదటి షోలోనే తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత పలు షోలు, ఈవెంట్స్ రన్ చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి తన ఆటతీరు, మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.బిగ్ బాస్‌కి వెళ్లిన తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది. దీంతో బిగ్ బాస్ నుంచి వచ్చాక, వరస ఆఫర్స్ అందుకుంది.

బ్యూటీ శ్రీముఖి షోలు చేయడమే కాకుండా, మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ, నటిగా కూడా సత్తా చాటింది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వరస ఫొటో షూట్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు పరికిణిలో అందంగా రెడీ అయ్యి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన ఈ అమ్మడు ఫ్యాన్స్ బ్యూటిఫుల్ శ్రీముఖి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.