
ఇవి పూర్తయ్యాక కంప్లీట్‌గా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తారా? లేకుంటే రష్మికలాగా నార్త్ అండ్ సౌత్‌ని కవర్ చేస్తారా అనేది తెలియాలంటే మిట్టి రిజల్ట్ వచ్చేవరకూ ఆగాల్సిందే.

కెరీర్ బిగినింగ్ నుంచే సీనియర్, జూనియర్ అనే తేడా చూడటం లేదు శ్రీలీల. మంచి కాన్సెప్ట్ ఉంటే చాలు... నేను సైన్ చేస్తా అంటూ వరుసబెట్టి సినిమాలు చేశారు. 2023లో ఏ సీజన్‌లో చూసినా మళ్లీ మళ్లీ కనిపించారు శ్రీలీల.

అయితే స్పెషల్ సాంగులు చేయడానికి ఇష్టపడటం లేదట శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులోనూ రెండు మూడు సినిమాలున్నాయి.

మరి ఇప్పుడేం చేస్తున్నట్టు అనుకుంటున్నారా? బాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అంతే కాదు, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతాయి. అంతే కాదు, పవర్‌స్టార్‌తో కలిసి వచ్చే ఏడాది పలకరించడానికి కూడా ఈ భామ సిద్ధమవుతున్నారు.

పవర్‌స్టార్ సినిమాతో పాటు, ఆయన వీరాభిమాని నితిన్ రాబిన్‌హుడ్‌లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. అంతా అనుకున్న ప్రకారం జరిగితే రాబిన్‌హుడ్ ఈ డిసెంబర్‌కి రావాలి. అలా కాని పక్షంలో 2025 క్యాలండర్‌కి ఫిక్సవ్వాలి. వీటన్నిటిని బట్టి 2025లో ప్రతి సీజన్‌లోనూ తన ప్రెజెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు శ్రీలీల. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా డాక్టర్‌గిరీని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనేమో మరి...!