
శ్రీలీల టైమ్ టర్న్ అవుతుందా..? చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఈమెకు అవకాశాలు క్యూ కట్టబోతున్నాయా..? గుంటూరు కారం తర్వాత ఖాళీగా ఉన్న శ్రీలీలకు.. పాత పరిచయాలే హెల్ప్ అవుతున్నాయేమో అనిపిస్తుంది.

కలిసొచ్చిన కాంబినేషన్‌లోనే మరో సినిమాకు రెడీ అవుతున్నారీ బ్యూటీ. మరి ఏంటది..? ఈ బ్యూటీ బిజీ అయ్యేదెప్పుడు..? గుంటూరు కారం తర్వాత ఊహించని విధంగా శ్రీలీల కెరీర్ నెమ్మదించింది. అప్పటి వరకు చేతినిండా సినిమాలున్న ఈ బ్యూటీకి.. సడన్ బ్రేకులు పడ్డాయి.

అమాంతంగా వచ్చిన ఫేమ్‌ని సస్టెయిన్ చేయడంలో కాస్త తడబడ్డారని అనిపించుకున్నారు శ్రీలీల. ఇప్పుడు మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అందులో భాగంగానే తన ధమాకా హీరో రవితేజతో జోడీ కట్టబోతున్నారా? మాస్ మహరాజ్‌తో ఈ బ్యూటీ నటిస్తారనే మాట ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ఇదే వైరల్ టాపిక్.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీలీల ఇందులో రవితేజకి జోడీగా నటించబోతున్నారు. ధమాకాతోనే ఈ భామ దశ తిరిగిపోయింది. కెరీర్ కష్టాల్లో ఉన్నపుడు.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మాస్ రాజానే మరోసారి శ్రీలీలకు ఆఫర్ ఇస్తున్నారు.