
పవన్ కల్యాణ్ - మహేష్‌బాబు... ఇద్దరి మధ్య ఇప్పుడు ఓ కామన్ పాయింట్ వెతుక్కున్నారు ఆడియన్స్. ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సినిమాల స్టార్టింగ్ విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ కనిపిస్తుందా? ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్.

హరిహరవీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా? ఓజీని ఫస్ట్ స్టార్ట్ చేస్తారా? పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని అమితంగా ఊరిస్తున్న విషయం ఇది. దీంతో పాటు సమానంగా క్యూరియాసిటీ రేకెత్తిస్తున్న మరో విషయం... పవన్ సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో ఉంటుందా? విజయవాడలో ఉంటుందా? ఇక్కడ ఆల్రెడీ వేసిన సెట్స్ లో షూట్ చేస్తారా? ఇలాంటి సెట్సే అక్కడ ఏర్పాటు చేస్తారా? అన్నది...

నిన్నటిదాకా సెల్ఫ్ గా జరిగిన ఈ డిస్కషన్‌ని ఇప్పుడు మహేష్‌తో ముడిపెడుతున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. పవర్‌స్టార్‌కీ, సూపర్‌స్టార్‌కీ మధ్య వండర్‌ఫుల్ పోలిక ఉందని చెప్పుకుంటున్నారు. అందులోనూ ఇద్దరూ ఒకేరకంగా బిహేవ్ చేస్తున్న తీరు గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు.

రీసెంట్‌గా తన మూవీ మేకర్స్ ని కలిసి పిక్స్ పెట్టారు పవన్ కల్యాణ్. అటు మహేష్ ముఫాసా ట్రైలర్‌ని షేర్ చేసుకున్నారు. చేయాల్సిన సినిమాలు కాస్త ఆలస్యమవుతున్నా.. ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడూ ఇలాంటివి షేర్ చేస్తూ.. 'మా హీరోలు సూపర్' అనిపించుకుంటున్నారు ఇద్దరూ...

పవన్ కల్యాణ్ ఏపీలో బిజీగా ఉంటే, మహేష్ మేకోవర్‌లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ చేయాల్సిన సినిమాలు కళ్ల ముందే ఉన్నాయి. కాకపోతే పవన్ సినిమాల విషయంలో సిగ్నల్ ఆయన నుంచే రావాలి. మహేష్ మూవీస్ పరంగా జక్కన్న కమాన్ అనాలి... అదొక్కటే తేడా.. మిగిలిందంతా సేమ్ టు సేమ్.. ఏమంటారు.. అంతేనా..