
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న పవన్ కల్యాణ్ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా గబ్బర్ సింగ్. రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేశారు పవన్ కల్యాణ్. ఇప్పటికే పవన్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్‌లో గబ్బర్ సింగ్‌ది స్పెషల్ ప్లేస్.

2023 శ్రుతికి చాలా బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి జస్ట్ ఒక్క సినిమా కాదు, బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో తన లక్ టెస్ట్ చేసుకున్నారు శ్రుతిహాసన్. రెండుసార్లూ క్లిక్ అయ్యేసరికి ఆనందానికి అవధుల్లేవు.

అనుకోకుండా జరిగినా ఇప్పుడు డిసెంబర్‌లోనూ రెండు సినిమాలతో జనాలను పలకరించడానికి రెడీ అయ్యారు. అందులో హాయ్ నాన్న ఎలాగూ మంచి సక్సెస్ అయింది. కనిపించింది కాసేపే అయినా, గోవాలో శ్రుతిహాసన్ డ్యాన్సులు జనాలను బాగానే ఎంటర్‌టైన్ చేశాయి.

ఆల్రెడీ ఓ హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్‌ని సలార్‌తో స్టార్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథలో శ్రుతి కేరక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? సెకండ్ పార్టులోనూ ఈ బ్యూటీ ఉంటారా? వంటివన్నీ అందరిలోన క్యూరియాసిటీ కలిగిస్తున్న విషయాలు.

కెరీర్ ఇంత పచ్చగా ఉంటే, మరింత ఫోకస్ చేయకుండా ఎవరు మాత్రం ఊరకుంటారు... అందుకే శ్రుతి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఆల్కహాల్ ముట్టుకుని ఎనిమిదేళ్లయిందని, అంతకు ముందు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడే తీసుకునేదాన్నని అన్నారు. ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉందంటున్న శ్రుతి... 2024లోనూ వరుస విడుదలలున్నాయని హింట్ ఇస్తున్నారు.