Anupama Parameswaran: రూట్ మార్చిన అనుపమ.. నెక్స్ట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా
బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అదే హీరోయిన్లయితే... ప్రతి ఏటా నాలుగు సినిమాలు వెనకేసుకోవాలని అనుకుంటారు. ఆల్రెడీ ఈ ఏడాది ఆ కోరిక శ్రుతిహాసన్‌కి తీరింది. వచ్చే ఏడాది సేమ్ రూట్లో ట్రావెల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కి కూడా జరుగుతుందా? కమాన్ లెట్స్ వాచ్. 2024లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి అనుపమ పరమేశ్వరన్‌కి. గతంతో ఒన్లీ పక్కింటి అమ్మాయి రోల్స్ కి పరిమితమయ్యేవారు మలయాళ బ్యూటీ అనుపమ. కానీ ఈ మధ్య కాస్త రూటు మార్చేసి అదరగొట్టే స్టెప్పులేస్తున్నారు.