
ఎప్పుడూ రేసులో లేనట్లే ఉంటారు కానీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటారు శృతి హాసన్. ఇప్పుడు కూడా రజినీకాంత్ కూలీ, సలార్ 2, జన నాయగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. దాంతో పాటు హాలీవుడ్‌లోనూ ది ఐ అనే సినిమా చేస్తున్నారు.

బాలీవుడ్ నుంచి కూడా శృతికి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శృతి హాసన్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సోషల్ మీడియాలో కనిపించకూడదని ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ.

ఈ రోజుల్లో ఫుడ్డు లేకుండా అయినా ఉంటారేమో గానీ ఇన్‌స్టా, ట్విట్టర్ లేకుండా ఉండట్లేదు హీరోయిన్లు. వాళ్లేం చేసినా అందులో పోస్ట్ చేస్తుంటారు.. అలాంటి సోషల్ మీడియాకు సెలవిచ్చారు శృతి. అన్నీ తెలిసే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు శృతి హాసన్.

కొన్నాళ్ల కింద ఈమె ట్విట్టర్ పేజీ హ్యాక్ అయింది.. అందులో కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు దర్శనమిచ్చాయి. వెంటనే బయటికొచ్చి ఇది తను పోస్ట్ చేసింది కాదని చెప్పారు శృతి. ఇది జరిగిన కొన్ని రోజులకే.. ఇప్పుడు సోషల్ మీడియాకు సెలవిస్తున్నట్లు తెలిపారు ఈ బ్యూటీ.

శృతి హాసన్‌కు ట్విట్టర్‌లో 7.8 మిలియన్.. ఇన్‌స్టాలో 24 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గానూ ఉంటారు.. కానీ సడన్‌గా శృతి తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ప్రశాంతత కోసమే కొన్నాళ్లు సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్తున్నానంటూ పోస్ట్ చేసారు ఈ భామ. మరి ఈ దూరం ఎన్నాళ్లనేది క్లారిటీ ఇవ్వలేదీమె.