
ప్రభాస్ మాత్రం ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు. కల్కి షూటింగ్ కొన్ని రోజులుగా శంకరపల్లిలోనే జరుగుతుంది. మరోవైపు మారుతి సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుంది.

ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా.. దేవర షూటింగ్ ఆపట్లేదు కొరటాల శివ. ఈ చిత్ర షూట్ శంషాబాద్‌లో జరుగుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రెండ్రోజులు పుష్ప 2కు బ్రేక్ ఇచ్చిన బన్నీ.. హైదరాబాద్ వచ్చేసారు. నేడో రేపో సెట్లో జాయిన్ కానున్నారు. చాలా రోజుల తర్వాత గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.

చిరంజీవి USలో ఉన్నా.. విశ్వంభర షూట్ మాత్రం కొల్లూరులోని గుంటూరు కారం సెట్‌లో జరుగుతుంది.బాలయ్య, బాబీ సినిమా కాంబోలో వస్తున్న NBK 109 సినిమా షూటింగ్ మియాపూర్‌లో జరుగుతుంది.

నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ BHELలో జరుగుతుండగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కూకట్ పల్లిలో.. రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో.. అడివి శేష్ గూఢాచారి 2 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.