Shobha Shetty: స్టన్నింగ్ లుక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ.. శోభా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఈమె తెలుగు లో ఒక పాపులర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది. ఆ తెలుగు సీరియల్ మరేదో కాదు అందరిని అలరించిన కార్తీకదీపం. ఆ సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది మోనిత కన్నడకు చెందిన నటి. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.