
పఠాన్ సినిమాతో ఈ ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్, ఈ సినిమా మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందుకే తన ప్రతీ సినిమాలోనూ ఆ రేంజ్ యాక్షన్ ఉండేలా చూసుకుంటున్నారా..? త్వరలో సెట్స్ మీదకు రాబోయే సినిమాతో పాటు ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

దాదాపు పదేళ్ల తరువాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, షారూఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో వరుసగా యాక్షన్ సినిమాల మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు కింగ్ ఖాన్.

పఠాన్ తరువాత చేసిన జవాన్ కూడా యాక్షన్ మూవీనే. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేసిన ఎమోషనల్ డ్రామా డంకీ మాత్రం అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. దీంతో మిగత అన్ని ప్రయోగాలు పక్కన పెట్టి ఓన్లీ యాక్షన్ మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు షారూఖ్.

త్వరలో కూతురు సుహానాతో కలిసి కింగ్ అనే సినిమా చేస్తున్నారు షారూఖ్. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే బ్రేక్ తీసుకోని మరి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కింగ్ ఖాన్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

కింగ్ తరువాత కూడా యాక్షన్ జానర్‌లోనే కంటిన్యూ అవుతున్నారు బాద్‌షా. తన రీ ఎంట్రీ మూవీ పఠాన్‌కు సీక్వెల్‌ను పట్టాలెక్కించబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్‌గా ఎనౌన్స్ అయిన ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.