
దగ్గుబాటి అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న సీక్వెల్ లీడర్ 2. రానా డెబ్యూ మూవీకి సీక్వెల్ కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ రేంజ్ కథ దొరక్క పోవటంతో ఇన్నాళ్లు డిలే అవుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫిలిం నగర్‌లో ట్రెండ్ అవుతోంది.

లీడర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి మార్కులు సాధించారు. స్టార్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తూ కూడా లీడర్ లాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న రానా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

లీడర్ సినిమా సూపర్ హిట్ కావటంతో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుటుందని భావించారు మేకర్స్. అయితే అప్పట్లో సీక్వెల్స్ ట్రెండ్ అంతగా లేకపోవటంతో ఆ ప్రాజెక్ట్ వెంటనే మెటీరియలైజ్ కాలేదు. కానీ సీక్వెల్స్ ట్రెండ్ మొదలైన తరువాత లీడర్ 2 కోసం డిమాండ్స్ తెర మీదకు వచ్చాయి.

తాజాగా మేకర్స్ కూడా లీడర్ 2 మీద ఫోకస్ పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ధనుష్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల, ఈ సినిమా పూర్తయిన వెంటనే లీడర్ 2ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.

లీడర్ 2ను మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మూవీలో రానాతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోలు గెస్ట్ రోల్‌లో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.