
యంగ్ డైరెక్టర్లతో పని చేస్తున్నపుడు వాళ్ల ఆలోచనలు కూడా అంతే యంగ్‌గా ఉంటాయి.. ఔట్ పుట్ కూడా అలాగే వస్తుంది. అందుకే సీనియర్స్ అదే చేస్తున్నారిప్పుడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున అందరిచూపు ఈ జనరేషన్ దర్శకులపైనే ఉంది.

ఈ క్రమంలోనే చిరంజీవి ప్రస్తుతం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్టతో 200 కోట్లతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. 20 ఏళ్ళ తర్వాత సోషియో ఫాంటసీ చేస్తున్నారు చిరంజీవి. వశిష్ట చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే విశ్వంభరకు ఓకే చెప్పారు మెగాస్టార్.

మరోవైపు బాలయ్య కూడా బాబీతో సినిమా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు.. బాలయ్యను కూడా అంతే వింటేజ్ లుక్‌లో చూపించాలని ఫిక్సైపోయారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు.

వెంకటేష్ కూడా తనకు F2, F3 లాంటి సినిమాలు ఇచ్చిన అనిల్ రావిపూడితో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. సైంధవ్ లాంటి సీరియస్ సినిమాతో ట్రాక్ తప్పిన వెంకీ.. అనిల్‌తో ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.

నాగార్జున సైతం అనిల్ అనే కొత్త దర్శకుడికి ఛాన్సిస్తున్నారు. సంక్రాంతి 2025కి చిరంజీవి, నాగ్, వెంకీ రానున్నారు.. బాలయ్య కూడా వస్తే పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది.