కోవిడ్ సమయంలో ఓటిటిలో వచ్చి ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర. సత్యం రాజేష్ హీరోగా బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. ముందుగానే సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ట్రైలర్ విడుదలైంది. చేతబడి బ్యాక్ డ్రాప్‌లోనే ఈసారి ఒక గుడికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌లు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ లాల్ సలామ్‌తో పాటు జ్ఞానవేల్‌తో సినిమాలకు కమిట్ అయ్యారు. వీటి తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుంది. అయితే లోకేష్ సినిమా అంటే కచ్చితంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందనుకుంటారంతా. కానీ అది LCUలో భాగం కాదని తేల్చేసారు దర్శకుడు లోకేష్.
సాయి ధరమ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీలో విరూపాక్షతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన ఈయన.. ఆ వెంటనే బ్రో సినిమా చేసారు. ఇప్పుడు సంపత్ నందితో సినిమాకు సై అన్నారు. ఈ సినిమా ఫస్ట్ హై అక్టోబర్ 15 తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దీనికి గాంజా శంకర్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'స్పార్క్ L.I.F.E'. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా డేట్ అయితే మేకర్స్ ఫిక్స్ చేయలేదు. జనవరి 14న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తుంది.