
అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే రెగ్యులర్ లైఫ్‌స్టైల్‌కు వస్తున్నారు. తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు సామ్. దాదాపు 16 నెలల తరువాత బ్రేడ్ స్లైస్ తింటున్నా అంటూ ఇన్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు సమంత, ప్రజెంట్ బ్రేక్‌లో ఉన్నారు.

లాంగ్ గ్యాప్ తరువాత మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ వాట్ ద ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది చిత్రయూనిట్. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్నారు.

పలు జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ సినిమాను తెలుగులో దీపావళి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆంద్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్ ఎ వెంకట్ దర్శకుడు.

ఐత్రాజ్ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంకతో తనకు గొడవ జరిగిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. అసలు అలాంటి గొడవేం జరగలేదన్నారు కరీనా. ఆ టైమ్‌లో వృత్తిపరంగా ఇద్దరి మధ్య మంచి పోటి ఉండేది. ఆ పోటి చూసి చాలా మంది గొడవలు జరిగాయని రూమర్స్ సృష్టించారని చెప్పారు.

కంగనా లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే కొన్ని కారణాలతో రిలీజ్ డేట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు కంగనా. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు.