Samantha: మర్చిపోలేని జ్ఞాపకాలు.. 15 ఏళ్ళ కెరీర్ ను గుర్తు చేసుకున్న సమంత..

Edited By:

Updated on: Mar 05, 2025 | 10:30 PM

కొన్నిసార్లు గతం ఎంత మర్చిపోదామనుకున్నా కుదరదు. కొన్ని జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడీ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం సమంతను గతం అలాగే వెంటాడుతుంది మరి. మర్చిపోదాం అని ఎంత ప్రయత్నించినా.. కొన్ని అలాగే గుర్తుండిపోతున్నాయ్ అంటుంది ఈ బ్యూటీ. మరి అవేంటి..? ఇంతకీ స్యామ్ ఏం చెప్పాలనుకుంటున్నారు..?

1 / 5
సినిమాలు చేయట్లేదు.. ఈ మధ్య బయట పెద్దగా కనిపించట్లేదు.. అభిమానులతో కనెక్షన్ కట్ అయిపోయిందేమో అనుకుంటారేమో..? అదే క్రేజ్.. అదే ఇమేజ్ అంటున్నారు సమంత.

2 / 5
ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా.. ఒక్కసారి అలా ఈమె సోషల్ మీడియాలోకి వచ్చారంటే రచ్చ రచ్చే. తాజాగా మరోసారి ఇదే చేసారు స్యామ్. చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

3 / 5
తాజాగా తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు స్యామ్. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చారీమే. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేం అని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ వేదాంతం మాట్లాడారు సమంత.

4 / 5
తన కెరీర్‌ను మార్చేసిన ఏ మాయ చేసావే గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు స్యామ్. ఏ మాయ చేసావేలో ప్రతీ సీన్ తనకు గుర్తుందని.. గేట్ దగ్గర నిలబడి కార్తిక్‌ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అన్నారు సమంత.

5 / 5
ఇన్నేళ్ల కెరీర్‌లో తన జీవితంలో ఎన్నో చూసానని.. తన బలమేంటి.. బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ళ కోసం వేచి చూస్తున్నానని చెప్పారీమే. ఏదేమైనా ఈమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంది.