
ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి, పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే.డివోర్స్ తర్వాత నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇక డివోర్స్, మయోసైటీస్ తర్వాత సమంత చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసందే.ఇక ఈ మధ్య సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.ముఖ్యంగా ఈ నటి ట్రలాలా అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ బ్యానర్ మీద శుభం అనే సినిమా మే 9న విడుదల కానుంది. దీంతో సమంత ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే తాను నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి మూవీ విడుదలై మంచి హిట్ అందుకోవాలని. దీంతో తన కొత్త ప్రయాణం మొదలు కావాలని ఈ బ్యూటీ కోరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తన సినిమా హిట్ కావాలని తిరుమలకు వెళ్లి పూజలు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సమంత శుభం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీ వైలెట్ కలర్ చుడీదార్‌లో చూడటానకి చాలా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఈ మధ్య సమంతకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ బ్యూటీ రాజ్ నిడియోరుతో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకోబుతంది. అంతే కాకుండా వీరు పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు రాకూడదని పూజలు చేసినట్లు సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.