
సినిమాలు చేయనపుడు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆడియన్స్ మరిచిపోతారు. ఎప్పుడూ కనిపిస్తుంటేనే.. ఇండస్ట్రీ కూడా గుర్తు పెట్టుకుంటుంది. అందుకే ఇద్దరు స్టార్ హీరోయిన్లు సినిమాల్లో గ్యాప్ వచ్చేసరికి.. తమను తాము ఫోటోషూట్స్‌తో గుర్తు చేస్తున్నారిప్పుడు. పైగా ఆ ఇద్దరూ పాన్ ఇండియన్ హీరోయిన్లే. మరి వాళ్లెవరు..?

ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. ఎంత ఇమేజ్ ఉన్నా కనీసం ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేస్తేనే వాళ్ల క్రేజ్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు మన హీరోయిన్లు.

ఈ విషయంలో సమంత అందరికంటే ముందుంటారు. తాజాగా ఇన్‌స్టాలో కొత్త ఫోటోలతో సందడి చేసారు స్యామ్. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు సమంత. ముంబైలో మాత్రమే ఉంటూ.. టాలీవుడ్‌కు దూరమవుతున్న వేళ చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాలో ఫ్యామిలీ ఫోటోస్ పోస్ట్ చేసారు స్యామ్.

హారర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న థామ... తన కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీ అంటున్నారు రష్మిక మందన్న. సల్మాన్‌కు జోడీగా నటిస్తున్న సికందర్ సినిమా షూటింగ్‌ను ఫ్యాన్ గర్ల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక.

ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా షూటింగ్స్‌కు దూరమైన ఈ బ్యూటీ... తాజాగా ఫోటోషూట్‌తో యాక్టివ్ అయింది. పుష్ప 2తో పాటు.. ధనుష్ కుబేరా, విక్కీ కౌశల్ చావా.. లేడీ ఓరియెంటెడ్ ది గాళ్ ఫ్రెండ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.