
ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరోయిన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్స్ లోనే కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రింకు రాజ్ గురు. మరాఠీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్. 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆమె నటించిన మొదటి సినిమా సైరత్. 2016లో విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

సైరత్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన రింకు రాజ్ గురు.. తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత మరాఠీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

తాజాగా వర్షంలో ఫోటోషూట్ చేసింది ఈ అమ్మడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయగా తెగ వైరలవుతున్నాయి. పట్టు చీరలో.. జడలో మల్లెపూలతో ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. బాపు బొమ్మలా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

దక్షిణాది లుక్ లో మరింత అందంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రింకు రాజ్ గురు నటించిన సైరత్ సినిమా ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది.నేటికీ ఏ సినిమా కూడా ఆ మూవీ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఈ సినిమలో ఆకాష్ తోసర్ హీరోగా నటించారు.

రింకు రాజ్ గురు, ఆకాష్ తోసర్ తమ మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ నాగరాజ్ మంజులే తెరకెక్కించిన ఈ చిత్రానికి జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. రింకు రాజ్ గురు త్వరలోనే దక్షిణాది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.