- Telugu News Photo Gallery Cinema photos Rowdy Hero Vijay Devarakonda next movies with small directors after family star movie Telugu Heroes Photos
Vijay Devarakonda: టాప్ డైరెక్టర్స్ కు నో.! కుర్ర దర్శకులకే ఎస్ అంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయా.? అగ్ర దర్శకులు కథలు తీసుకొస్తున్నా.. ఆయన మాత్రం నో అంటున్నారా..? స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయకూడదని రౌడీ బాయ్ ఫిక్సైపోయారా.? లైగర్‌తో విజయ్‌లో వచ్చిన మార్పులేంటి.? వరసగా కుర్ర దర్శకులకే అవకాశం ఇవ్వడం వెనక అంతరార్థమేంటి..? విజయ్ దేవరకొండతో పని చేయడానికి అగ్ర దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Updated on: Feb 27, 2024 | 11:11 AM

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయా..? అగ్ర దర్శకులు కథలు తీసుకొస్తున్నా.. ఆయన మాత్రం నో అంటున్నారా..? స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయకూడదని రౌడీ బాయ్ ఫిక్సైపోయారా..? లైగర్‌తో విజయ్‌లో వచ్చిన మార్పులేంటి..?

వరసగా కుర్ర దర్శకులకే అవకాశం ఇవ్వడం వెనక అంతరార్థమేంటి..? విజయ్ దేవరకొండతో పని చేయడానికి అగ్ర దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. సుకుమార్, కొరటాల శివ అయితే రౌడీ బాయ్‌తో సినిమాలు చేస్తామని ప్రకటించారు కూడా.

కానీ విజయ్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. లైగర్ ముందు వరకు అగ్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తిగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు విజయ్. కుర్ర దర్శకులకే ప్రయారిటీ ఇస్తున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఎప్రిల్ 5న విడుదల కానుంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా మళ్లీ మొదలు కానుంది. దీని తర్వాత కూడా వరసగా కుర్రాళ్ళ వైపే అడుగులేస్తున్నారు రౌడీ బాయ్.

తెలుగు, తమిళ, కన్నడ దర్శకులు తీసుకొచ్చే కథలు వింటున్నారు విజయ్. ఈ క్రమంలోనే ముగ్గురు దర్శకుల కథలు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ సినిమా వచ్చే ఛాన్సుంది. అలాగే కెప్టెన్ మిల్లర్ ఫేం అరుణ్ ముత్తేశ్వరన్, కన్నడ దర్శకుడు నార్తన్ కథలు లైన్‌లో ఉన్నాయి.

కుర్ర దర్శకుల సినిమాలతో మార్కెట్ పెంచుకున్నాక.. స్టార్ డైరెక్టర్స్ వైపు అడుగేయాలని చూస్తున్నారు విజయ్. మొత్తానికి లైగర్‌తో మంచి గుణపాఠమే నేర్చుకున్నారు విజయ్.




