
నటి రోజా తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ ఇలా సీనియర్ హీరోల అందరిసరసన నటించి, తన నటన, అందంతో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా తన మార్క్ చూపెట్టింది.

ఇక రోజా అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అయితే ఇప్పుడు ఆమె వింటేజ్ లుక్‌ను తన కూతురు గుర్తు చేసింది. అచ్చం తన తల్లిలా రెడీ అయ్యి, పాత రోజానేనా అనేలా తన క్యూట్ ఫొటోస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి ఒకసారి ఆఫొటోస్ పై లుక్ వేద్దాం.

నటి రోజాకు కూతురు, కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే తన కూతురు అన్షు మాలిక అచ్చం తన తల్లిలానే ఉంటుంది. అయితే తాజాగా అన్షు అచ్చం తన తల్లి రోజా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో, అలా రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

రోజా వింటేజ్ లుక్‌లో ఉన్న అన్షు ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ అచ్చం రోజానే చూసినట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంత మంది తల్లికి జిరాక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక నటి రోజా ప్రస్తుతం పలు టీవీ షోల్లో జడ్జీగా చేస్తున్న విషయం తెలిసిందే.