
రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఎ లెజెండ్: చాప్టర్ 1 ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ ఏడాదిలో అతిపెద్ద సినిమా విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్, నటీనటుల యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద, కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు రూ. 818 కోట్లు దాటింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా సినిమా మొత్తం రూ. 807 కోట్లను రాబట్టగా.. ఇప్పుడు కాంతార రూ.818 కోట్లు రాబట్టి ఛావా సినిమాను అధిగమించింది. అక్టోబర్ 24, 2025న భారతదేశంలోనే రూ. 38 కోట్ల వసూళ్లను వసూలు చేసింది.

కేవలం రెండు వారాల్లోనేఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 717 కోట్లు సంపాదించింది. ఇప్పుడు 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది కాంతార చాప్టర్ 1. చావా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కన్నడ, హిందీ, తమిళం, తెలుగు వెర్షన్‌లతో సహా అన్ని భాషలలో కలెక్షన్లలో సత్తా చాటుతుంది.

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 పురాణాలు, జానపద కథలు, ఆధ్యాత్మిక సమ్మేళనంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇందులో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రుక్మిణి, రిషబ్ శెట్టి యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు కలెక్షన్లలో సత్తా చాటిన ఈ సినిమా దూసుకుపోతుంది. ఛావా సినిమాను అధిగమించి మరో ఘనత సాధించింది.