- Telugu News Photo Gallery Cinema photos Do You Know These Heroines Still Unmarried at age of 50 years, Check List
Actress : 50 ఏళ్ల వయసులో ఒంటరిగానే.. ఇప్పటికీ పెళ్లి చేసుకోని స్టార్ హీరోయిన్స్ వీళ్లే.. ఎవరెవరంటే..
సినీరంగుల ప్రపంచంలో తెరపై కనిపించిన తారల జీవితాలు అంతగా అందంగా ఉండవు. ఇండస్ట్రీలో అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసిన తారలు.. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అయితే ఒకప్పుడు సినిమా ప్రపంచాన్ని ఏలిన తారలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మరికొందరు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని హీరోయిన్స్ వీళ్లే.
Updated on: Oct 25, 2025 | 12:20 PM

సుస్మితా సేన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగులోనూ నాగార్జునతో జతకట్టింది. అయితే ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న ఆమె.. పెళ్లికి మాత్రం దూరమే. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. కానీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో టబు ఒకరు. చిరంజీవి, బాలకృష్మ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించిన టబు.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. అయినప్పటికీ పెళ్లి దూరంగా ఉంటూ ఒంటరిగా గడిపేస్తుంది.

శోభన.. సీనియర్ హీరోయిన్. అందమైన కళ్లు.. అద్భుతమైన డ్యాన్స్, సహజ నటనతో కట్టిపడేసింది. ఒకప్పుడు సీనియర్ హీరోలకు జోడిగా నటించిన శోభన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది. మరోవైపు సొంతం శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది.

అమీషా పటేల్.. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవలే గదర్ 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది.

తెలుగులో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హీరోయిన్ నగ్మా. అందంతోపాటు అభినయంతో మెప్పించింది. ఈ బ్యూటీ ప్రేమ వ్యవహరాలు అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తలేదు. అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉంటుంది.




