
హీరోల మార్కెట్‌తో పనిలేకుండా బడ్జెట్ పెట్టినపుడు వర్కవుట్ అయితే.. ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్‌లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

అదేంటని అడిగితే తమ లెక్కలు తమకున్నాయి అంటున్నారు. పాన్ ఇండియా కారణంగా నాన్ థియెట్రికల్ నుంచే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయి. దాంతో బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్.

ఆ క్రేజ్ తండేల్ అనౌన్స్ మెంట్ టైమ్‌లోనూ బాగా కనిపించింది.రీసెంట్‌గా దూత వెబ్‌సీరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య. ఆల్రెడీ కార్తికేయ సీక్వెల్‌తో నార్త్ జనాలనూ మెప్పించారు చందు మొండేటి.

