మోటార్ సైకిల్‌పై ఉన్న ఈ అమాయకపు చిన్నారి, పాన్ వరల్డ్ స్టార్ బ్యూటీ అని తెలుసా?
మోటార్ సైకిల్ పై స్పెడ్స్ పెట్టుకొని కూర్చున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఈ చిన్నది ప్రస్తుతం హాలివుడ్, బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న క్రేజీ బ్యూటీ అని మీకు తెలుసా? ఇంతకీ ఈ బేబీ ఎవరంటే? అందాల సుందరి, గ్లామర్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ, హాలీవుడ్, బాలీవుడ్‌లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Feb 21, 2025 | 2:55 PM

ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే, నార్మల్ హీరోయిన్‌గా బాలీవుడ్ లో అడుగు పెట్టి ఇప్పుడు ఇంటర్నేషల్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలివుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ.. హాలివుడ్ స్టార్ హీరోయిన్‌గా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

తమిళన్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ దిహీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎస్పై, అందాజ్, ఫ్లాన్, కిస్మత్, అసంభవ్, టాక్సీ నంబర్, ఆప్ కి ఖాతిర్ వంటి చాలా సినిమాల్లో నటించింది. తన అందం, నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గాఉంటే ఈ గ్లామర్ బ్యూటీ వరసగా ఫొటో షూట్స్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. అందులో ప్రియాంక చూడటానికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.

మోటార్ సైకిల్ పై కూర్చొని, పెద్ద కళ్లద్దాలు పెట్టుకొని చూడటానికి అసలు ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ ప్రియాంకనేనా అనిపిస్తుంది. ఇక ఇది చూసిన తన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రియాంక చోప్రా ఆస్తి దాదాపు 700కోట్లుకు పైగా ఉంటుందంట. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ టాలీవుడ్‌లో మహేష్ బాబుతో జోడీ కట్టబోతున్నట్లు సమాచారం.