Rashmika Mandanna: ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
Rashmika Mandanna
Follow us on
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటేస్ట్ మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమాలో శ్రీవల్లి 2.0గా మెప్పించింది. ముఖ్యంగా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో రష్మిక యాక్టింగ్ వేరెలెవల్. ఇక ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ పాట రిలీజ్ అయ్యాక.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే పాట షూట్ చేశామని అన్నారు. మొత్తం ఐదు రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు.
అల్లు అర్జున్ గారితో డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయానని పేర్కొన్నారు. కానీ మొదట్లో కాస్త భయంగా, అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించింది.
సాధారణంగా తనను ఎవరైనా ఎత్తుకుంటే భయమేస్తుందని.. పాటలో అల్లు అర్జున్ సర్ ఎత్తుకుని ఎత్తుకుని స్టెప్పేస్తారని తెలిపింది. అప్పుడు చాలా భయపడ్డానని.. ఆ తర్వాత నార్మల్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది.